మహబూబ్నగర్ జిల్లా కొత్తగంజ్ లోని జై శబరీష భక్తబృందం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ 4 తారీఖున నిర్వహించే మహా పడిపూజకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖులను ఆహ్వానించిన భక్త బృందం స్థాపకుడు పూజ్య శ్రీ జనార్దన్ గురుస్వామి ఆహ్వానించారు.
అంగరంగ వైభవంగా సాగే ఈ మహా పడిపూజ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాలోని అయ్యప్ప స్వాముల అందరికీ జనార్దన్ గురుస్వామి ఆహ్వానం పలికారు.
అయ్యప్ప స్వాములు సివిల్ సాములు కుటుంబ సభ్యులు అందరూ పడిపూజ కార్యక్రమానికి విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నారు.
అయ్యప్ప పడిపూజ జరుగు స్థలం కొత్తగంజ్ సింహపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణం నాలుగు డిసెంబర్ ఉదయం 11 గంటలకు.
మీ అందరిని ఆహ్వానిస్తున్న వారు పూజ్య శ్రీ జనార్దన్ గురుస్వామి జై శబరిష భక్త బృందం.
Tags
News@jcl


