తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రక్షాళనపై దృష్టిసారించింది. గత ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రక్షాళనపై దృష్టిసారించింది. గత ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారుల పోస్టింగుల్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. అక్రమంగా పోస్టింగులు తెచ్చుకున్న అధికారులపై అంతర్గతంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది
బీఆర్ఎస్ పార్టీకి అంటకాగిన అధికారులపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఒకటి రెండు రోజుల్లో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇంటర్నల్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ అధికారులు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది
