కలెక్టర్ నుండి ఏఎన్ఎం దాకా నిర్బంధమే..!* *షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"*

 *


 *కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బాధపడకండి* 


 *‘ఆరోగ్యశ్రీ’ పరిమితి రూ.10 లక్షలు* 


 *1383 రోగాలకు చికిత్సలు, సర్జరీలు* 



 *289 రుగ్మతలకు వర్తింపు* 


 *పరిమితి పెంపు కార్యక్రమ ప్రారంభంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు* 


 *హాజరైన మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీలు* 


గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ నుండి ఏఎన్ఎం దాకా ఉద్యోగ పరంగా స్వేచ్ఛ లేక నిర్బంధమైన సేవలు అందించారని వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విముక్తి లభిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు.


రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం లాంటిదని, ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల పరిమితి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచగా.. ఆ పెంపు అమలు కార్యక్రమాన్ని ఆదివారం  రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు, అదనపు అధికారిని డాక్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. షాద్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఆర్డీవో వెంకట మాధవరావు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఫరూక్ నగర్ జెడ్పిటిసి పి. వెంకట్రామిరెడ్డి కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం 1383 రోగాలకు చికిత్సలు, సర్జరీలు, 289 వైద్య రుగ్మతలకు వరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సరైన వైద్యం అందలేదని అన్నారు. కోవిడ్ సమయంలో వైద్య అధికారులు, సిబ్బంది సేవ చేశారే తప్ప ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఉద్యోగస్తులు ఉద్యమకారులు ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇప్పుడు సహకారమైందని అన్నారు. ఉద్యోగస్తులు కూడా ఎంతో మేలు చేశారని అన్నారు. ఒక దశలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రావడానికి ఉద్యోగస్తుల కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మందికి రాజు ఆరోగ్య శ్రీ కింద పది లక్షల రూపాయల వైద్య భరోసా కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం దశలవారీగా ప్రజలకు దశల వారీగా అన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు...

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow