షాద్ నగర్ లో కౌంటింగ్ ఏజెంట్లకు ఇంకా అందని పాసులు..!*

 *షాద్ నగర్ లో కౌంటింగ్ ఏజెంట్లకు ఇంకా అందని పాసులు..!* 




 *_రేపు ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం_*


 *గండిపేట లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు* 


రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రానికి సంబంధించిన ఏజెంట్ పాసులు రాత్రి 9 గంటల వరకు కూడా ఆయా రాజకీయ పార్టీల సంబంధిత సిబ్బందికి అధికారులు అందజేయలేదు. పోలీసు విచారణ ఇతరత్రా కారణాలు ఏవైనా సరే రాత్రి 9 గంటల వరకు ఇంకా పాసులు అందకపోవడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి బీఎస్పీ ఇంకా తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. 

షాద్ నగర్ అసెంబ్లీలో ఒక లక్ష 93 వేల పై చిలుకు ఓట్లు పోలింగ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఒక్క పార్టీ అభ్యర్థికి 17 పాసులు అందజేయాలి. ఇప్పటివరకు అభ్యర్థులకు పాసులు అందలేదు. ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను ఎంతో ఆలస్యంగా చేపడుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయంలో అధికారులు ఆలస్యంగానే స్పందిస్తున్నారు. గత ఎన్నికలకు పోల్చి చూస్తే ఎంతో వ్యత్యాసం ఉందని ప్రధాన పార్టీ అభ్యర్థులు పలువురు మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేస్తున్నారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow