రేవంత్‌ రెడ్డికి భద్రత పెంపు.

 

Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి భద్రత పెంపు.. ఇంటికి చేరుకుంటున్న ట్రాఫిక్‌ పోలీసులు..

రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌, కామారెడ్డి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్‌ ఇంటికి క్యూకడుతోన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ అంశం ఆసక్తిగా మారింది


రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌, కామారెడ్డి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్‌ ఇంటికి క్యూకడుతోన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ అంశం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిసిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. శనివారమే పోలీసులు భారీగా రేవంత్ ఇంటికి చేరుకున్నారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, రేవంత్‌ అనుచరులు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. రేవంత్‌ ఇంటి వద్ద పెద్ద ఎత్తులో బాణసంచా కాలుస్తూ సందడి చేశారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow