శబరిమలకు చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి వెళ్ళే అయ్యప్ప స్వాములు రెండు రోజులకు సరిపోయే విధంగా స్టీల్ బాటిళ్లలో మంచినీళ్లు, ఫ్రూట్స్, ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళండి.
దర్శనానికి 18 నుంచి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. ఒక్కో కంపార్ట్మెంట్ లో అరగంటకు పైగా స్వాములు వేసి ఉండాల్సి వస్తుంది. ఈ సందర్భంగా తోపులాట జరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులతో జాగ్రత్త, ట్రావెన్కూర్ దేవస్థానం వారు సరైన ఏర్పాట్లు ఏమి చెయ్యలేదు. మంచి నీరు మాత్రం ఇస్తున్నారు. నీళ్లు, పండ్లు, ఫుడ్ కచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. (కొట్టాయం, చెంగనూర్ , ఎరుమేలి నుంచి నీలకల్ పార్కింగ్ కు వెళ్ళే దారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది)
నియమి నిష్ఠలతో 41 రోజుల పాటు దీక్ష చేసి స్వామి వారి దర్శనానికి వెళ్తే సన్నిధానంలో ని పద్దెనిమిది మెట్లను అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సరిగ్గా ఎక్కనివ్వడం లేదు. అయ్యప్ప స్వామి వారిని ఒక్క క్షణం కూడా చూడనివ్వకుండా పక్కకు లాగేస్తున్నారు. దయచేసి స్వాములు పై విషయాలను గమనించి జాగ్రత్తలు పాటించగలరు. 🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప - *సతీష్ ముదిరాజ్ గురుస
Tags
News@jcl

