అక్రమ ఇసుక పై ఉక్కు పాదం మోపుతానంటున్న జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి.
నా గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు జడ్చర్ల ఎమ్మెల్యే.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక రోజులోనే ఫిల్టర్ ఇసుక మరియు డంపింగ్ కేంద్రాల పైన 17 కేసులు పెట్టించాలని అక్రమ ఇసుక గురించి మీ దగ్గర ఏ సమాచారం ఉన్న నాకు పంపించండి నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను.
అక్రమ ఇసుక వ్యాపారంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నా కూడా వెంకీ తిరిగి చూడనని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపారు.
భూ కబ్జాలు ప్లాట్ల కబ్జాలు వెంచర్ల కబ్జాలు ప్రభుత్వ స్థలాల కబ్జాల గురించి పూర్తి విచారణ చేపట్టాలని కలెక్టర్కు తెలిపారని త్వరలోనే అన్ని విషయాల పైన పూర్తిగా సమాచారం సేకరించి తప్పకుండా చర్యలు తీసుకుంటానని శాసనసభ సమావేశాలు స్పీకర్ ఎన్నిక ఉన్నందువల్ల రెండు మూడు రోజులు బిజీగా ఉంటానని తర్వాత క్యాంపు కార్యాలయంలో వారంలో ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
క్రమంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు అనిరుద్ రెడ్డికి శాలువలు కప్పి సన్మానించేందుకు వచ్చారు.
