Banks: ఖాతాదారులకు అలర్ట్.. జనవరిలో 11 రోజులు బ్యాంకులు బంద్. పూర్తి వివరాలు..
రెండో, నాలుగో శనివారాలు కాకుండా బ్యాంకులు మొత్తం 11 రోజులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక సెలవుల ఆధారంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రాష్ట్రాల్లో జరిగే స్థానిక వేడుకల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇక బ్యాంకులు మూతపడి ఉన్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎలాంటి అంతరాయాలు...
2023 ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో కొత్తేడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఇక కొత్తేడాది తొలి నెలలో బ్యాంకుల హాలీడేస్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. జనవరిలో నెలలో బ్యాంకులు ఏయే తేదీల్లో మూతపడుతాయో వివరిస్తూ సెలవుల జాబితాను విడుదల చేసింది.
రెండో, నాలుగో శనివారాలు కాకుండా బ్యాంకులు మొత్తం 11 రోజులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక సెలవుల ఆధారంగా బ్యాంకు పనివేళల్లో మార్పులు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రాష్ట్రాల్లో జరిగే స్థానిక వేడుకల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇక బ్యాంకులు మూతపడి ఉన్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా పనిచేస్తాయి. మరి వచ్చే జనవరిలో ఏయే తేదీల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం..
* జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
* జనవరి 7వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
* జనవరి 11వ తేదీ మిషనరీ డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు.
* ఇక జనవరి 12వ తేదీ శుక్రవారం.. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బంగాల్‌లో సెలవు దినంగా ప్రకటించారు.
* జనవరి 13వ తేదీ రెండో శనివారాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
* జనవరి 14వ తేదీ ఆదివారం (సంక్రాంతి) దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
* జనవరి 15వ తేదీ సోమవారం రోజున పొంగల్, తిరువళ్లూర్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బ్యాంకులకు సెలవు.
* జనవరి 16 వతేదీ మంగళవారం తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోంలో హాలిడేగా ప్రకటించారు.
* జనవరి 17వ తేదీన బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు.
* జనవరి 21వ తేదీన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
* జనవరి 23వ తేదీ మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించారు.
* జనవరి 25వ తేదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు.
* జనవరి 26వ తేదీ శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
* జవనరి 27వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు.
* జనవరి 28వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
* ఇక జనవరి 31వ తేదీ బుధవారం మిడామ్ మే ఫి సందర్భంగా అసోంలో బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు.
Tags
News@jcl