డెహ్రాడూన్:నవంబర్ 12
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్ కొంత భాగం ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మంది వరకు కార్మికులు లోపల చిక్కుకున్నట్టు సమాచారం.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్‌యారా నుచి దండల్‌గావ్‌కు మధ్య ఈ టన్నెల్ ఉంది. చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా 4 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం జరుగుతోంది.
ఉత్తరకాశీ నుంచి యమునోత్రి ధామ్ వరకు 26 కిలోమీటర్ల ప్రయాణాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం.ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో టన్నెల్‌లో ఉన్న 150 మీటర్ల పొడవైన సొరంగ భాగం కూలింది.
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్ అందించేందుకు ఓ పైప్‌ను ఏర్పాటు చేసి, వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల శ్లాబ్‌ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సొరంగంలో ఆక్సిజన్ పైపును పంపించడానికి, చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేయడానికి ఇరుకైన మార్గాన్ని తవ్వుతున్నారు.....
Tags
News@jcl
