అమ్మ బాగున్నారా.. నీళ్లు కరెంటు మంచిగొస్తుందా..?

బంగారు మైసమ్మ ఆశీర్వాదంతో 23వ వార్డులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటన.
Jadcherla dt.12/11/2023: జడ్చర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజల దీవెనలతో అఖండ మెజార్టీ సాధిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా కరెంటు సక్రమంగా సరఫరా జరుగుతుందా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత (9) ఏళ్లలో వార్డులో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టామని, మున్సిపాలిటి ప్రతి వార్డులో డ్రైనేజీలు, సిసి రోడ్లు 100% పూర్తి చేస్తున్నామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ ఆదరించాలని, కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow