బిజెపికి బిగ్ షాక్..
జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన 150 మందికి పైగా యువకులు బిఆర్ఎస్ లో చేరిక
Jadcherla dt.10/11/2023: జడ్చర్ల మున్సిపాలిటీలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి చెందిన 150 మందికి పైగా యువ కార్యకర్తలు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
గత తొమ్మిది ఏళ్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో జడ్చర్ల పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్య తీరిందని, ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం వెంటే తామంతా ఉండాలని నిశ్చయించుకొని పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతు యువకులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పథకాలను ప్రతి గడపకు చేర్చి పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేయాలని, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
Tags
News@jcl
