హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఏడుగురు కార్మికులు మృతి

హైదరాబాద్: నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్‌ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాకప సిబ్బంది.. మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకాశి మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాధమికంగా గుర్తించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ అదుపులోకి రాని ఆగ్నికీలలు. ఇక్కడి పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. కమర్షియల్ కం రెసిడెన్సియల్ బిల్డింగ్‌గా గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ గ్యారేజ్ వద్ద ఉన్న డీజిల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలకు కారణం అయింది. సర్వీసింగ్‌కి వచ్చిన కార్లలోని డీజిల్‌ను డ్రమ్ముల్లో నిలువ ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow