@జడ్చర్ల
రాహుల్ గాంధీ
ఇవి దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు
ఒకవైపు బడుగు బలహీన వర్గాలు.. మరోవైపు కేసీర్, అతని కుటుంబం
తెలంగాణ లో ఆదాయం వచ్చే శాఖలన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయి..
ల్యాండ్, స్యాండ్, వైన్ ఇలా దోపిడీ జరిగే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారు..
కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టులు కుంగుతున్నాయి...
తెలంగాణ లో ప్రతీ ఒక్కరిపై రూ.31,500 అప్పు వేశారు.
ధరణి పోర్టల్ పేరుతో భారీ ఎత్తున భూ దోపిడీ జరిగింది.
కంప్యూటరైజేషన్ పేరుతో తెలంగాణాలో పేదల భూములు దోచుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా ప్రజల ఖాతాల్లో వేస్తాం
ప్రజల సర్కారు మీ డబ్బులు మీ కోసమే ఖర్చు చేస్తుంది
మహిళలకు ప్రతీ నెలా రూ.2500, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం
ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు కట్టుకునేవారికి రూ.5లక్షలు సాయం అందిస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ నెలా పెన్షన్ దారులకు రూ.4వేలు అందిస్తాం
ప్రతీ నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం..
కేసీఆర్ ను గద్దె దించడం ఖాయం
కేసీఆర్ దోచుకున్న కాళేశ్వరం, ధరణి ద్వారా దోచుకున్న సొమ్ము లెక్క తేలుస్తాం..
ఈ దేశంలో విద్వేషానికి తావులేదు.
మోదీ, బీజేపీ దేశంలో విద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్నారు
ద్వేషాన్ని పంచే బజారులో నేను ప్రేమను పంచే దుకాణం తెరిచాను
దేశంలో 50 శాతం మంది ఓబీసీ జనాభా ఉంటుంది
కానీ దేశాన్ని నడిపించే వారిలో వీరి స్థానం ఎంత..
దేశంలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో ఎవరికీ తెలియదు
దేశాన్ని నడిపే 90 మంది అధికారుల్లో ఎంత మంది బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నారని నేను ప్రశ్నించా
90మందిలో కేవలం 3ముగ్గురు మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు.
అందుకే ఓబీసీ జనగణన జరగాలని చెబుతున్నా
దేశంలో ఓబీసీ, దళితులు, గిరిజనుల లెక్క తేలాలి
వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ విద్వేషాన్నీ రెచ్చగొడుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతాం..
బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే
Tags
News@jcl