TS: తెలంగాణలో ఎన్నికల వేళ టీడీపీ సంచలన నిర్ణయం!

TS: తెలంగాణలో ఎన్నికల వేళ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు గత 40 రోజులుగా జైల్లో ఉండడం.. నారా లోకేష్ చుట్టూ కేసులు చుట్టుకోవడం తో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలతో తెలంగాణలో ఓట్లు చీల్చే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి స్తబ్దంగానే ఉండి బిజెపికి గాని brs కానీ సపోర్ట్ చేస్తుందా.? అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చెల్లా చెదిరి క్యాడర్ ఇప్పటికే బీఆర్ఎస్ లో కాంగ్రెస్లో చేరిపోయిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.? ఈ ఎన్నికల నుంచి టీ-టీడీపీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీ-టీడీపీ నేతలకు తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు వెల్లడి కావలిసి ఉంది .
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow