కారులో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త... కారు అద్దం ధ్వంసం చేసి..పట్టపగలే రూ.13 లక్షలు కాజేసి!

కారులో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త... కారు అద్దం ధ్వంసం చేసి..పట్టపగలే రూ.13 లక్షలు కాజేసి!
బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచిన ఓ కారు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. అందులోంచి రూ.13 లక్షలతో పరారయ్యారు. పట్టపగలు.. చుట్టూ జనాలు ఉండగానే ఈ చోరీ జరగడం గమనార్హం. బెంగళూరు (Bengaluru) లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. పోలీసుల వివరాలు, సీసీ పుటేజీ ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు స్థానికంగా నిలిపి ఉంచిన ఓ బీఎండబ్ల్యూ కారు వద్ద తచ్చాడుతూ కనిపించారు. ఒకరు బండిపైనే ఉండగా.. మరొకరు కారు డ్రైవర్ వైపు ఉండే అద్దాన్ని ధ్వంసం చేసి, అక్కడినుంచే లోపలికి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే రూ.13 లక్షల నగదు చోరీ చేసి, తాపీగా ఇద్దరు బైక్పై పరారయ్యారు. నిందితులు ముఖానికి మాస్కు వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా అక్కడున్న కెమెరాల్లో నిక్షిప్తమైంది. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సర్జాపుర్ పోలీసులు తెలిపారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow