*మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు*
వనపర్తి కాదు వరి పర్తి, వడ్ల పర్తి
వేరుశెనగ పంట కూడా ప్రధానంగా సాగవుతున్నది
23 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు తెలంగాణ కోసం బయలుదేరి ప్రభంజనం సృష్టించారు
కేసీఆర్ గారి ఆశీస్సులతో తొమ్మిదిన్నరేళ్లలో వనపర్తి అభివృద్దికి కృషిచేశాను
ఇచ్చిన మాటప్రకారం జిల్లాను ఏర్పాటు చేసుకుని అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలను నిర్మించుకున్నాం
కల్వకుర్తి ఎత్తిపోతల నుండి డీ8, పెద్దమందడి, ఘణపురం బ్రాంచ్ కాలువల ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు తెచ్చిన తర్వాతనే 2018 ఎన్నికల్లో నామినేషన్ వేశాను
ఆ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఇచ్చారు .. రోడ్ల విస్తరణ పూర్తయి పట్టణం విశాలంగా అందంగా తయారయింది
ఇవేకాకుండా నర్సింగ్, మత్స్య, వ్యవసాయ డిగ్రీ కళాశాల వంటి ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి
నియోజకవర్గంలోని అన్ని తండాలు, గ్రామాలకు రహదారులు నిర్మించుకున్నాం
అతివేగంగా వనపర్తి నెత్తిమీద కుండలా ఏదుల రిజర్వాయర్ ను నిర్మించుకున్నాం
వనపర్తి వందేళ్ల పేదరికం, కరువును దూరం చేశాం
ప్రజల కళ్లలో కొత్త ఆనందాన్ని చూడగలుగుతున్నాం
మంచినీటి కొరత లేకుండా చేసుకున్నాం
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరాయి
వనపర్తిలో పశువైద్య కళాశాల ఏర్పాటు చేయాలి
వనపర్తికి ఉత్తరం వైపున బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని మనవి
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
రంగనాయకుల స్వామి ఆలయం, వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి చేయూతనివ్వాలి
వనపర్తి రాజభవనం పునరుద్దరణకు నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు
వనపర్తి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వడమే కాకుండా మీకు ఇష్టమైన వ్యవసాయ శాఖ ద్వారా రైతాంగానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను
రైతులు తల ఎత్తుకుని తిరిగే రాష్ట్రంగా తెలంగాణ దేశం ముందు నిలబడింది
Tags
News@jcl




