JADCHERLA:- P O, APO ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రవి నాయక్

_________________________________ @ పిఓ, ఏపీవోలు ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి @ ఎన్నికల నిర్వహణకై ఎన్నికల సంఘం జారీచేసిన సూచనలు జాగ్రత్తగా అనుసరించాలి- జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవినాయక్
రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా ఈనెల 27 ,28 తేదీలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ పెసైడింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులను పిఓ,ఏపిఓ లు సద్వినియోగం చేసుకోవాలని
శుక్రవారం అయన జడ్చర్ల బిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరై శిక్షణా తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గదులలో శిక్షణ పొందుతున్న పిఓ, ఏపీఓలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకై ఇస్తున్న శిక్షణలో ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే తక్షణమే నివృత్తి చేసుకోవాలని చెప్పారు.పి ఓ ఏ పి ఓ ల కు మరోసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను హార్డ్ కాపీ తోపాటు, సాఫ్ట్ కాపీ ఇస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం జారీచేసిన సూచనలను ప్రతి పీవో, ఏపీవో తప్పనిసరిగా అనుసరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. శిక్షణా తరగతులు ఎలా ఉన్నాయి?ఏమైనా సమస్యలున్నాయా ?అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాస్టర్ ట్రైనర్లు ఇస్తున్న శిక్షణను శిక్షణ పొందుతున్న వారితో పాటు, తరగతి గదిలో కూర్చుని పరిశీలించడమే కాకుండా, వారి సందేహాలను నివృత్తి చేశారు. మాస్టర్ ట్రైనర్లు ఇస్తున్న శిక్షణ పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జడ్చర్ల రిటర్నింగ్ అధికారి ,రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, ట్రైనింగ్ నోడల్ అధికారి మరియు డిఈఓ ఏ.రవీందర్, డిఆర్డిఓ యాదయ్య, జడ్చర్ల తహసిల్దార్ శ్రీనివాసులు, డిపిఓ వెంకటేశ్వర్లు,జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ మహబూబ్, ఎంఈఓ మంజుల, తదితరులు ఉన్నారు
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow