*ఈత చెట్లను నరికి వేసిన రాయలసీమ రియాల్టర్లు*
*-ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపణ*
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామం ఈత కల్లుకు ప్రసిద్ధిగాంచిన గ్రామం.
అలాంటిది అక్కడ ఉన్న భూములపై ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యేల కన్ను పడింది.
జడ్చర్ల మండలం లోని లింగంపేట గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో 7800 ఈత చెట్లు ఉన్నాయని ఆ భూమిని రాయలసీమ చెందిన ఎమ్మెల్యే శిల్ప మోహన్ రెడ్డి అనుచరులు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 500 ఈత చెట్లను అక్రమంగా నరికివేసి కాల్చివేయడంతోపాటు గుంతలు తీసి పూడ్చివేశారని ఇట్టి విషయమై జడ్చర్ల ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కల్లుగీత కార్మికులు ఆరోపించారు.
తమ కొనుక్కున్న భూమిలో ఈత చెట్లను తొలగింపుతో గీత కార్మికులు ఎక్సైజ్ అధికారులను సంప్రదించారు.
ఎక్సైజ్ అధికారులు స్పందించడం లేదని ఫిర్యాదు.
తమ రియాల్టర్ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాయని రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి అనుచరులు అయినా రియాల్టర్ లు వందలాది ఈత చెట్లను నరికివేసి తమకు జీవన ఉపాధి లేకుండా చేసి తమ కడుపు కొడుతున్నారని కళ్ళు గీత కార్మికులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు తొలగించిన ఈత చెట్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు సర్వే నిర్వహించి అ చెట్లకు నెంబర్లు కూడా కేటాయించారని ఈ చెట్ల పై ఆధారపడి లింగంపేట కావేరమ్మపేట బాదేపల్లి గ్రామాలకు చెందిన గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారని అలాంటి చెట్ల ను రియాల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది చట్టం తొలగించడంతో తాము జీవనోపాధి కొలుపోయీ వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని గి త చెట్లను తొలగించడానికి అనుమతులు తప్పనిసరి అని తప్పనిసరిగా చెట్లను తొలగించాల్సి వస్తే అట్టి చెట్లను మరోచోటకు తరలించాల్సి ఉన్న రియల్ వ్యాపారులు తమ స్వార్థం కొరకు అక్రమంగా చెట్లను ఇష్టానుసారంగా నరికివేసారని ఈత చెట్లను నరికివేసిన రియల్ వ్యాపారులపై ఇప్పటికైనా అధికారులు పెద్ద ప్రకారంగా చర్యలు చేపట్టి కల్గీత కార్మికులకు న్యాయం చేయాలని గీత కార్మికులు సురేందర్ గౌడ్ వెంకటయ్య గౌడ్ సాయిరాం గౌడ్ లు ఎక్సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Tags
News@jcl








