జడ్చర్లలో రెబల్ గా బరిలో దిగనున్న మాజీ ఎమ్మెల్యే ఎం చంద్రశేఖర్....

జడ్చర్లలో రెబల్ గా బరిలో దిగనున్న మాజీ ఎమ్మెల్యే ఎం చంద్రశేఖర్....
తెలంగాణ రాష్ట్రంలోని జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో మహబూబ్ నాగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు నేడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అలియాస్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రజలలో పట్టులేని అభ్యర్థికి సర్వేలు అనుకూలంగా లేని అభ్యర్థికి పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ ను ఓడించుకునేలా చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మరోకసారి సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థి ఎవరు అధిష్టానం తెలుసుకోవాలని ఎర్రశేఖర్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 9 తారీకు నాడు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాతలు చేస్తున్నట్లు మాజీ ఎర్రశేఖర్ మీడియాకు తెలిపారు. గతంలో నేను చేసిన అభివృద్ధి చేశానని రాబోయే కాలంలో కూడా జడ్చర్ల ప్రజలకు అందుబాటులో ఉంటాను అని ఆయన అన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow