నవాబుపేటలో పండుగ సాయన్న జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

*బహుజనుల పేదల కోసం కృషి చేసినవాడు పండుగ సాయన్న. *నవాబుపేటలో పండుగ సాయన్న జయంతిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
Nawabpet: బహుజనులలోని పేదల కోసం పోరాటం చేసినవాడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నవాబుపేటలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పండుగ సాయన్న ఒక ప్రాంతానికి పరిమితం కాదని ,ఆనాటి బహుజనులలో ఉన్న పేదల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. బడుగు వర్గాల వారందరికీ అన్నం పెట్టిన మహనీయుడన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే బడుగు, బలహీనవర్గాల కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రలు బయటకు వస్తున్నాయన్నారు. స్వరాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow