పాలమూరు పట్టణంలో ఏళ్ల తరబడిగా జర్నలిజం వృత్తిలో ఉంటూ నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నామని మన పాలమూరు అభివృద్ధి ఫోరం అధినేత మున్నూరు రవి స్పష్టం చేశారు. పాలమూరు లోని అర్హులైన జర్నలిస్టులకు తెలంగాణ ఉద్యమకారులమంతా ఏకమై బిక్షాటన చేసైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటుగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు తక్షణమే ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పాలమూరు పట్టణం లోనే టీటీడీ కళ్యాణమండపం వద్దగల ధర్నా చౌక్ లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నేత బండి విజయ్ కుమార్, జిల్లా ముఖ్య నేతలు గోపాల్, గండేటి నరసింహులు, కలీం లతో పాటుగా పలువురు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు మన పాలమూరు అభివృద్ధి ఫోరం అధినేత మున్నూరు రవి సంఘీభావం తెలిపారు మున్నూరు రవి తన టీం సభ్యులతో ధర్నా శిబిరం వద్దకు వచ్చి జర్నలిస్టులకు పూలమాలలు వేసి తన మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నారు. అనంతరం మున్నూరు రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అలాంటి ఉన్నతమైన వృత్తిలో గల జర్నలిస్టులు పాలమూరు పట్టణంలో అద్దె ఇళ్లల్లో ఉంటూ అవస్థలు పడుతూ దుర్భరంగా జీవితాలను కొనసాగించడం తనను తీవ్రంగా కలిసి వేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కోసం తాను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మున్నూరు రవి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు రవి ,మైత్రి యాదయ్య ,సిపియం నాయకులు కురుమూర్తి ,ఏ రాములు ,TSUTF నాయకులు వెంకటేశ్వర్లు ,పటేల్ వెంకటేష్ ,మాలె రోహిత్ రెడ్డి ,పటేల్ రాకేష్ ,కార్ధే ఆంజనేయులు ,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు .
Tags
News@jcl.
