-జడ్చర్ల సిగ్నల్ గడ్డ రైల్వే ట్రాక్ వద్ద మురుగు కాలువలో లభ్యమైన మృతదేహం ఉన్న బ్యాగు
#newsatjclజడ్చర్ల :
జడ్చర్ల పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద గల రైల్వే మురుగు కాలువలో బట్టల్లో చుట్టి బ్యాగులో నెలలు నిండని మృత శిశువు శవం కుళ్ళిన దశలో లభ్యమైనది. రైల్వే కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న రైల్వే ట్రాక్ మురుగు కాల్వ ను మంగళవారం మధ్యాహ్నం శుభ్రం చేపడుతున్న రైల్వే కార్మికులకు సిగ్నల్ గడ్డ ప్రాంతంలోని బ్రిడ్జి కింద మురుగు కాలువలో బ్యాగు లభ్యమైందని, అందులో నుండి దుర్వాసన వస్తుండడంతో కార్మికులు బ్యాగును తీసి చూడగా అందులో బట్టల్లో చుట్టి నెలలు నిండని 5,6 నెలల మృత శిశువు శవం కూలిన దశలో ఉందని, దీంతో రైల్వే అధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఈ ఘటన సమాచారం అందించామని రైల్వే కార్మికులు తెలిపారు. కాగా నెలలు నిండని చిన్నారి మృతదేహాన్ని మట్టిలో పూడ్చి పెట్టాల్సింది పోయి బట్టల్లో చుట్టి బ్యాగులో పెట్టి కలువలో పడేయాల్సిన అవసరం ఏముందని. పెళ్లికాకముందుకే గర్భం దాల్చిన యువతులకు పట్టణంలో అనేక ప్రవేట్ ఆసుపత్రుల్లో చట్ట వ్యతిరేకంగా అబార్షన్లు చేస్తున్నారని ఈ నెలలు నిండని మృత శశివు శవం కూడా అలాంటిదే అయి ఉంటుందని. తమ బండారం బయటపడకుండా ఆత్రుతలో శవాన్ని బ్యాగులో చుట్టి మురికి కాలువలో పడేసి ఉంటారని పట్టణ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
Tags
News@jcl.

