రాష్ట్రస్థాయిలో జడ్చర్ల పేరు ప్రఖ్యాతలు..
ఫస్ట్ ర్యాంకు సాధించడం గర్వకారణం.
మణిదీపిక ఉన్నత చదువులకు చేయూతనిస్తాం.
ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అమ్మాయికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందనలు.
Jadcherla : జడ్చర్ల పట్టణానికి చెందిన శ్ఫణిరాజ్ గౌడ్, సుభాషిని దంపతుల కుమార్తె మణిదీపిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం పై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించి జడ్చర్ల పేరు ప్రఖ్యాతలను రాష్ట్రస్థాయిలో నిలపడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో మణిదీపికను శాలువాతో సన్మానించారు. ఆమె ఉన్నత చదువులకు చేయూతనందిస్తానని భరోసానిచ్చారు. ఉన్నత చదువులు చదువుతూ మన ప్రాంతానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Tags
News@jcl.
