వలసల దిశగా పాలమూరు నుండి ముంబాయి వైపు.(మరో ప్రయత్నం)
రోడ్డు విస్తరణలో షాపు కోల్పోయిన ఒక కుటుంబ పెద్ద బాధ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేషనల్ హైవే అథారిటీ అనాలోచిత చర్యలతో.. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు దాదాపుగా 8 ఫీట్ల పైకి లేపడం వల్ల బిసినెస్ పూర్తిగా పడిపోవడంతో.
ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో భాగంగా ముంబయి వైపు వ్యాపారాన్ని వెతుకుతూ జనం . పాలమూరు భూమి లోకి కూరుకు పోయిన వ్యాపారాన్ని పైకి లేపడం ఇప్పట్లో జరిగేలా లేదు, చాల ఇతర ప్రయత్నాల తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.(ప్రభుత్వాలు వినోద సంబంధిత నిర్మాణాల మీద చేసే ఖర్చు కన్నా కూడా ప్రజల నోట్లో కి అన్నం ముద్ద, జేబులోకి నాలుగు పైసలు వచ్చేటట్లు ఉండే పథకాల లాంటి వాటిపైన దృష్టి పెడితే బాగుండేది). కనీసం మైనారిటీ వర్గాలలోనో లేక దళిత సామాజిక వర్గంలోనో పుట్టినా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవి కానీ దురదృష్టానికి "బీసీ" కమ్యూనిటీ లో పుట్టడం పై నుండి ఇప్పుడ.ు నిర్ణయాత్మక పాత్ర లేని "పద్మశాలి" కులంలో పుట్టడం నా దురదృష్టం...! చూద్దాం... భారతదేశం చాల విశాలమైనది నాకు ..నా వ్యాపారానికి, నా జీవనానికి చోటు లేకుండా పోతుందా ..? అటు వైపు పరిస్థితి ఎలావుందో.. అభివృద్ధి ఎలావుందో తెలుస్తుంది కూడా.
ముక్యంగా నారాయణపేట డిపో నుండి ముంబాయి కి బస్సు వయా మహబూబ్ నగర్ పై నుండి వెయ్యడం హర్షించదగ్గ విషయం. ప్రతి రోజు ఉదయం 11 గంటలు స్థానిక బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. అవసరం అయినా వాళ్ళు గమనించగలరు, ఉపయోగించుకోగలరు. ఈ విషయం లో ప్రభుత్వానికి కృతజ్ఞతలు.🙏🙏🙏
నోట్: ఏది ఏమైనా నేను ,నా జీవితం,నా జీవనం, నా గమనం... అభివృద్ధి లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.
Tags
News@jcl.
