చలివేంద్రం ప్రారంభానికి ఖరారు కానీ ముహూర్తం!! జడ్చర్ల మున్సిపాలిటీ వారు మంత్రి లేదా ముఖ్యమంత్రితో ప్రారంభిస్తున్నారా..? ఎందుకు మొదలు అవటంలేదు ..?

చలివేంద్రం పనులు ప్రారంభించి 15 రోజులు అవుతున్న ప్రారంభం కానీ చలివేంద్రం. ఏప్రిల్ 7 తారీఖు నాడు తడుకలు తీసుకొచ్చి రోడ్డు మీద పాతేసి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత వాటికి గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి కట్టార..ు ఆ తర్వాత రెండు రోజుల క్రితం రోడ్డు మీద ఇసుక తీసుకొచ్చి పోసి వెళ్లిపోయారు.
ద్విచక్ర వాహనదారులు ఆ ఇసుక మీద జారీ కిందపడి దెబ్బలు తగిలించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. సీఎం వచ్చి ప్రారంభిస్తారేమో అందుకోసమే ఆలస్యం అవుతుందని ముక్కు మీద వేలు వేసుకుంటున్న ప్రజలు. జడ్చర్ల మున్సిపాలిటీ వారు జడ్చర్ల చెందిన ఒక బడా కాంట్రాక్టర్కు చలివేంద్రం పనులు అప్పగించినట్లు సమాచారం. ఏప్రిల్ నెల సుమారు పూర్తి అవుతున్న ఎండలు మే నెలలో మాత్రమే ఉంటాయి, కనీసం 45 రోజుల సమయం కూడా లేదు కానీ చలివేంద్రం ప్రారంభం కి నోచుకోవడం లేదు. చేసేది మంచి కార్యమైన సకాలంలో చేయడం లేదు.?
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow