అప్పంపల్లిలో....
ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు
ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శనలు
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల పరిధిలోని అప్పంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రయోగాలను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. జీవ , భౌతిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ ప్రయోగాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉన్నాయి. రసాయనిక ఎరువులతో పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పును వివరించేందుకు వివిధ రకాల ఎరువులను ప్రదర్శనలో ఉంచారు. సేంద్రియ ఎరువుల వల్ల కలిగే ఉపయోగాలను పర్యావరణానికి చేసే మేలును విద్యార్థులు చక్కగా వివరించారు. గుండె, మూత్రపిండాలకు సంబంధించిన ప్రయోగాలను ప్రత్యక్షంగా చూపించి అవి పనిచేసే విధానాన్ని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన త్రీడీ హాలోగ్రామ్ విద్యార్థులు ప్రదర్శించి ఔరా అనిపించారు. రక్త పరీక్షలు నిర్వహించి బ్లడ్ గ్రూపులను నిర్ధారించారు. విటమిన్లు వాటి ఉపయోగాలను విద్యార్థులు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.విద్యార్థులు ప్రదర్శించిన మంత్రాలకు చింతకాయలు రాలవు నాటిక ఆలోచింప జేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం రామకృష్ణ సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాసులు సుశీల ఉపాధ్యాయులు చక్రవర్తి గౌడ్ ఎల్లయ్య రవిశంకర్ పద్మజ అనురాధ సాదియా ఫర్హత్ కవిత తదితరులు పాల్గొన్నారు
Tags
News@jcl.