విద్యార్థులే అటెండర్లు.
మండల విద్యాశాఖ అధికారి హెడ్మాస్టర్ గా కొనసాగుతున్న పాటశాలలో ఇలా జరగడం సోచనీయం.
ఇక్కడ ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం కన్నా ఇతర కార్యక్రమాల మీద శ్రద్ధ ఎక్కువ.
తీసికట్టుగా మారుతున్న ప్రభుత్వ స్కూళ్లలో బోధనలు మేము మారమంటున్నాం ఉపాధ్యాయులు.
18 ఫీట్ల రాడుకుకట్టిన పరదాలు ఇప్పించిన సిబ్బంది
విద్యార్థులతోనే కుర్చీలు మోయించిన వైనం
జడ్చర్ల: బాదేపల్లి బాలుర ప్రభుత్వ పాఠశాలలో ఘటన, జడ్చర్ల పట్టణం లోని బాదేపల్లి ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపా ధ్యాయులు విద్యార్థుల తోనే పనులు చేయించిన ఘటన వెలుగుచూసింది. శుక్రవారం పాఠశాలలో మండలస్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అనంతరం కొందరు విద్యార్థులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు.
• ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు కార్యక్రమం అనంతరం అతిథులు వెళ్లిపోయిన తరువాత ఉపా ధ్యాయులు విద్యార్థులను ఆపి స్టేజీ పైన వేసిన కుర్చీలను, స్టేజికి 18 ఫీట్ల పైన రాడ్లకు కట్టిన పరదాలను ఇప్పించారు. అంతేకాక వాటిని విద్యార్థుల తలపై పెట్టి పాఠశాలలోని స్టోర్ రూములో పెట్టించారు. 18 ఫీట్ల పైన ఉన్న రాడ్లపైకి విద్యార్థులను ఎక్కించి పరదాలను విప్పించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. విద్యార్థులు అక్కడినుంచి పడితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కవు విద్యార్థుల కలిగిన ప్రభుత్వ పాఠశాల అయిన బాదేపల్లి బాలుర పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యతోపాటు అటెండర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ విద్యార్థులతో ప్రమాదకరంగా పనులు చేయించడంపై తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనపై ఉన్నతాధికా రులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కుర్చీలు ఎత్తుకెళ్తున్న విద్యార్థి
Tags
News@jcl.