జడ్చెర్ల లో రోజుకో భూ వివాదం !!ప్లాట్ల స్కీం లలో పెద్ద స్కాం!! 30 ఏళ్ల నుంచి ఎందుకు పెండింగ్లో ఉంది

స్కీములలో ప్లాట్ అమ్మి సొమ్ము చేసుకున్నారు పైసల్ కట్టినోళ్ళు రోడ్డున పడ్డారు. జడ్చర్ల లోని సర్వేనెంబర్ 18లో 1993లో నెలకు 200 చొప్పున స్కీం లలో ప్లాట్లకు డబ్బులు కట్టించుకున్నారు ఈ సర్వే నెంబర్లు పలానా నెంబర్ ప్లాట్ మీకు వస్తది మీరు డబ్బులు కట్టండి అన్నారు తక్కువ డబ్బులకు ప్లాట్లు వస్తాయి కదా అనే ఉద్దేశంతో వాళ్లకు వచ్చిన అరకురా జీతం పైసలులో సగం స్కీములలో ప్లాట్లకు వెచ్చించారు.
తీరా స్కీము కాల పరిమితి ముగిసిన తర్వాత ఫ్లాటు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని వెంచర్ యజమానులను అడగగా వెంచర్ భూమి కోర్టు పరిధిలో ఉంది కేసు అయిపోయాక ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు 30 సంవత్సరాలు గడిచిన కేసు కోర్టులోనే ఉంది కడుపు చంపుకొని స్కీములు ప్లాట్లు కొన్న వాళ్ళు చనిపోయారు వారసులు ఇప్పుడు ప్లాట్ల కోసం పోరాడుతున్నారు. ఇక్కడ వెంచర్ చేసిన వాళ్ళు మోసం చేశారా ఫ్లాట్లు కొన్న వాళ్ళు అత్యాశకు మోసపోయారా అనే విషయం తెలియడం లేదు. జడ్చర్లలో పొలము మరియు ప్లాట్లు కొనాలి అంటే రాష్ట్ర మొత్తం భయపడుతున్న వేళ. రెండు దిక్కుల రాజకీయ నాయకుల చదరంగంలో సామాన్యులు బలి అవుతున్నారు భూమి ప్లాట్ల కోసం పంచాయతీ • పోలీస్ బందోబస్తు నడుమ ప్లాట్ల చదును • వారసులమని ఒకరు కొనుగోలు దారులం అని మరొకరు జడ్చర్లలో హైడ్రామా కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి ప్లాట్లు కొన్నామని 30 ఏళ్ల తర్వాత కోర్టులో కేసు గెలిస్తే వారసులమని, మరికొందరు వచ్చి భూమి మాది అని గొడవ చేస్తున్నారని శుక్రవారం పెద్ద మొత్తంలో బాధితులు ఆందోళన చేపట్టారు. బాధి తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.... బాదేపల్లి పట్టణానికి చెందిన 16 మంది వ్యాపారులు 1989వ సంవత్సరంలో సర్వే నెంబర్ 18లో దాదాపు 24 ఎకరాల 37 గుంటలు భూమిని పట్టణానికి చెందిన కొందరు మైనార్టీలతో కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1990 సంవత్సరంలో 24 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ చేసి దాదాపు 600 ప్లాట్లను లబ్ధిదారులకు విక్రయించారు. తర్వాత కొందరు భూమి అమ్మిన వ్యక్తుల వారసులు న్యాయస్థానాలు నాశ్రయించగా 2020 సంవత్సరంలో భూమి కొన్నవారికి హక్కు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. అప్పట్లో ప్లాట్లు అమ్మిన వారికి అప్ప చెప్పేందుకు వెళ్లగా తిరిగి వారసులమని చెప్పుకునే కొందరు జూనియర్ సివిల్ కోర్టులో దావా వేసి స్టే తీసుకురావడంతో రెండేళ్ల కాలం పాటు న్యాయస్థానంలో కేసు నడవగా గత ఏడాది డిసెంబర్లో కేసు డిస్మిస్ చేస్తూ భూమి కొన్నవారికి హక్కులు కల్పించిందన్నారు. గత ఏడాది నుంచి ప్లాట్లు చదును చేసేందుకు వెళ్లగా కొందరు మహిళలు అక్కడ టెంట్లు వేసుకొని భూమి తమది అని ఇక్కడికి ఎవరు రావద్దని బెదిరింపులకు పాల్పడుతుండడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించగా మూడు నెలల అనంతరం విచారణ చేసి ప్లాట్లు చదును చేసుకోమని చెప్పగా మళ్లీ గొడవలు సృష్టిస్తున్నారని అందుకే ప్లాట్ లో యజమానులు అందరూ కలిసి భూమి చదును చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మరియు ఉన్నతాధికారుల శాంతిభద్రతల కోసమే పోలీసుల మోహరింపు. పట్టణంలో సర్వేనెంబర్ 18లో భూమి యజమానులు ప్లాట్లు కొన్నవారు జేసీబీతో పనులు చేసుకుంటుంటే ఇక్కడే కొందరు వేసుకొని భూమి యజమానులం మేము అని పడుతున్నాడంతో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు /
Previous Post Next Post

نموذج الاتصال