జడ్చర్లలో ఘరానా మోసం చేసిన దుబాయ్ కరెన్సీ కేసులో ముగ్గురి అరెస్ట్.
జడ్చర్ల టౌన్, : ఈ నెల 5న జడ్చర్లలో జరిగిన || దుబాయ్ కరెన్సీ ఎక్చేంజ్ కేసులో ముగ్గురు నింది తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు. శనివారం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ప్రెస్మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. బంగ్లాదేశ్కు చెందిన ఏడుగురు రోహింగ్యాలు. హర్యానాకు చెందిన మరొకరు ముఠాగా ఏర్పడి మహబూబ్ నగర్ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరన్నపేటకు చెందిన ఫరిస్సా యాస్మిన్. ఆమె భర్త సిరాజుద్దీన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఆప్టికల్స్ షాపు నిర్వహి స్తున్నారు. వీరి వద్దకు వెళ్లిన నిందితులు 100 దిర్హా మ్లకు ఇండియన్ కరెన్సీ కావాలని అడగగా వాళ్లు ఇచ్చారు. ఈ క్రమంలో సిరాజుదీనే భార్య పరిసా యస్మిన్తో మాటలు కలిపిన ప్రధాన నిందితుడు | రిపూన్ తనవద్ద 10 వేల డిరామ్లు ఉన్నాయని. వాటి విలువ ఇండియన్ కరెన్సీ లో రూ. 2 లక్షలు|| అవుతుందని, తమకు రూ. 15లక్షలు నమ్మించాడు. పేపర్ బెండల్లో ఇస్తే చాలని కట్టిన సబ్బులను
చూపించడంతో నమ్మిన ఫరిస్సా యాస్మిన్ బ్యాంక్ నుంచి రూ.5లక్షల నగదు డ్రా చేసింది. వీటిని జడ్చర్లలోని పోస్టాఫీస్ సమీపంలో వారికి అడ్వాన్స్ గా ఇచ్చి వారి నుంచి దుబాయ్ కరెన్సీగా చెప్పిన బ్యాగ్ను తీసుకుంది. ఇంటికి వెళ్లి చూడగా మోస పోయినట్లుగా గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం జడ్చర్లలోని కొత్త బస్టాండ్లో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురి బ్యాగులకు తనిఖీ చేయగా 2100 దీర్ఘామ్లు దొరికాయి. అదుపులోకి తీసుకొని విచా రించగా.. మోసం చేసిందని తామేనని ఒప్పుకు న్నారు. నారాయణపేటలో ఇదే తరహా మోసానికి పాల్పడిపట్లు వారు అంగీకరించారు. ముఠాకు చెందిన రశీదా ఖాన్, సోహెల్ , రహీంబాన్ను అరెస్ట్ చేశామని ప్రధాన నిందితుడైన రిపూన్తో సహ మరో నలుగురు పరారీలో ఉన్నారని. వారికోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సైలు బాదర్, లెనిన్, వేంకటేశ్వర్లు పాల్గొన్నారు..
Tags
News@jcl.