మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని తాలూకా క్లబ్ రోడ్ లో గల స్మార్ట్ వండర్స్ పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉత్తమ సృజనాత్మకతని బయటపెట్టి వివిధ ప్రయోగాలు చేశారు.
ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి చేసిన సౌండ్ చేసే తుపాకీ చాలా బాగా ఉంది పంట పొలాలలో కోతులు ఇతర పక్షులు వచ్చి పంటలు నాశనం చేస్తే విధంగా వాటికి ఎటువంటి హానీ కలగకుండా ఒక కార్బోహైడ్రిక్ పదార్థాలతో వాటర్ మిక్స్ చేసేసి గ్యాస్ లాయటేర్ తో టిక్ చేయగా పెద్దగా శబ్దం రావడం వచ్చిన వాళ్ళని ఆకట్టుకుంది.
ప్రమాదాలకు గురికాకుండా ఉండేటందుకు డ్రైవింగ్ సీట్లో ఉన్న వారికి నిద్ర వస్తే ఏ విధంగా ఇంజన్ ఆఫ్ చేయొచ్చు అనే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది అలాగే వివిధ రకాల ప్రదర్శనలతో స్మార్ట్ వండర్ స్కూల్ వేదిక అయింది.
ఈ కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసేసి ప్రదర్శనలు ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ మాట్లాడుతూ ఈ సైన్స్ ప్రదర్శనకు రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చాలా బాగున్నాయి అని అన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేదే ఉపాధ్యాయ వృత్తి అని అందుకోసమని ప్రతి విద్యార్థిని మేము ఒక శాస్త్రవేత్త లాగానే తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మాకు ఇంతగానం తోడ్పాటు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు
Tags
News@jcl.