వినాయక చవితి రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను విగ్రహం దగ్గర పెట్టకండి!

🕉️ గణేష్ చతుర్థి - వాస్తు నియమాలు

వినాయకుడి పూజలో ఈ పొరపాట్లు చేయకండి!

హిందూ సంప్రదాయంలో గణేష్ చతుర్థి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి నాడు వినాయకుడు జన్మించాడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే, పూజ చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను వినాయకుడి విగ్రహం దగ్గర పెడితే ఇంట్లో శాంతి, సంతోషాలు కరువవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
తులసి ఆకులు
పురాణాల ప్రకారం వినాయకుడి పూజలో తులసిని అసలు ఉపయోగించకూడదు. విగ్రహం దగ్గర గానీ, ఆయనకు సమర్పించే నైవేద్యంలో గానీ తులసి ఆకులు ఉండకుండా చూసుకోవాలి.
తోలు వస్తువులు
లెదర్ లేదా తోలుతో చేసిన పర్సులు, బెల్టులు, బూట్లు, చెప్పులు వంటి ఏ వస్తువును కూడా వినాయకుడి పూజా గదిలో లేదా వినాయకుడి విగ్రహం దగ్గర ఉంచకూడదు. వీటిని అపవిత్రంగా భావిస్తారు.

🗑️
చెత్తబుట్టలు, చీపుర్లు
వినాయకుడి పూజా స్థలంలో ఎప్పుడూ పరిశుభ్రత ఉండాలి. విగ్రహం చుట్టూ చెత్తబుట్టలు, చీపుర్లు లేదా పనికిరాని వస్తువులు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్ముతారు.
🖼️
హింసాత్మక చిత్రాలు
వినాయకుడి మందిరంలో లేదా వినాయక విగ్రహం దగ్గర ఎలాంటి ప్రతికూల, హింసాత్మక లేదా బాధాకరమైన ఫోటోలు, చిత్రాలను పెట్టకూడదు. ఇవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని తెచ్చి శాంతికి భంగం కలిగిస్తాయి.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow