మూసాపేట్లో ఏడు నెలల బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. హార్ట్ బీట్ లేదు.. సీపీఆర్తో తిరిగొచ్చిన ప్రాణం


 ఆగిపోయింది అనుకున్న ప్రాణం తిరిగొచ్చిన ఘటన హైదరాబాద్ మూసాపేట్ లో జరిగింది. ఏడు నెలలకే శిశువు జన్మించడం.. అందులో గుండె కొట్టుకోక పోవడం కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఆగిపోయింది అనుకున్న ప్రాణం తిరిగి రావటంతో కుటంబం ఊపరిపీల్చుకుంది.

కూకట్ పల్లి మూసాపేట కు చెందిన శైలజ అనే పేషెంట్ ఏప్రిల్ 27 ( సోమవారం) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పురిటి నొప్పులతో ఇంట్లో డెలివరీ  అయ్యింది.  పుట్టిన శిశువు గుండె కొట్టుకోకుండా ఉండడంతో 108 కు కాల్ చేశారు.  ESI అంబులెన్స్108 సిబ్బంది EMT సతీష్, పైలెట్ రఘు కలిసి.. కాల్ సెంటర్ డాక్టర్ కేశవరెడ్డి సూచనలతో బేబీకి సీపీఆర్ అండ్ BVM చేస్తూ నీలోఫర్ వరకు తీసుకెళ్లి ఐసీయూలో అడ్మిట్ చేశారు. 

ఆసుపత్రి వరకు సీపీఆర్ చేస్తూ ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బేబీని నీలోఫర్ చేర్చారు 108 సిబ్బంది.  తక్షణమే స్పందించిన ESI  Ambulance 108 సిబ్బందినీ అభినదించారు నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు. ప్రస్తుతం మదర్ అండ్ బేబీ నీ నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow