స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. అనంతరం డస్ట్‌బిన్‌లో వేసి పరారయ్యే ప్రయత్నం


 

స్కానింగ్ సెంటర్‌లో మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత బిడ్డను వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గుర్తించారు.
నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో ఓ మైనర్ బాలిక సోమవారం రాత్రి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. జిల్లాలోని ఓ మండలానికి చెందిన మైనర్ బాలిక కడుపు నొప్పి ఉంది అంటూ తన తల్లితో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షించి స్కానింగ్ చేసుకుని రమ్మని చెప్పారు. తల్లి కూతురు కలిసి ఆ ఆస్పత్రికి సమీపంలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కడుపునొప్పి ఎక్కువగా ఉంది అంటూ బాలిక బాత్రూంకు వెళ్ళింది. అక్కడే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను డస్ట్‌బిన్‌లో వేసి పరారు అయ్యేందుకు బయటకు వెళ్లారు. ఇంతలో బాత్రూంకు వెళ్లిన మరికొందరు విషయాన్ని గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయినా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చి తల్లీబిడ్డను అక్కడే ఉంచారు. పోలీసులు వచ్చి బాలికను, పసిబిడ్డను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow