హైదరాబాద్ మధురానగర్ లో దారుణం: రూ. 2 వేల 500 కట్టినా జాబ్ ఇప్పించలేదని.. కత్తితో పొడిచి చంపేశాడు..


హైదరాబాద్ మధురానగర్ లో దారుణం జరిగింది. కన్సల్టెన్సీ జాబ్ కోసం రూ. 2 వేల 500 చెల్లించినా జాబ్ ఇప్పించలేదని కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ ను కత్తితో పొడిచి చంపేశాడు ఓ వ్యక్తి. మంగళవారం ( మార్చి 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మధురానగర్ లోని వారాహి కన్సల్టెన్సీ జాబ్ కోసం రూ. 2 వేల 500 చెల్లించాడు ఓ వ్యక్తి. రోజులు గడుస్తున్నా జాబ్ ఇప్పించకపోవడంతో మేనేజర్ శశికిరణ్ తో గొడవకు దిగాడు నిందితుడు. ఈ క్రమంలో అతనికి వెయ్యి 500 చెల్లించాడు శశికిరణ్. మిగతా రూ. వెయ్యి కోసం గొడవపడ్డాడు నిందితుడు. ఇద్దరి తీవ్ర వాగ్వాదం జరిగడంతో శశికిరణ్ పై కత్తితో దాడి చేశాడు.
శశికిరణ్ కు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు శశికిరణ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow