Bomb in Rectum: వీడెవడండి బాబు.. ఏకంగా బాంబునే ‘అక్కడ’ పెట్టుకున్నాడు, అది చూసి డాక్టర్లు.. పరుగులు


 కొంతమంది.. ‘‘బాంబ్ లగాదేంగే.. సీటు కింద బాంబు పెట్టేస్తా’’ అంటూ సరదాగా జోకులు వేస్తుంటారు. అయితే, ఇతగాడు.. తనకు తానే బాంబు పెట్టేసుకున్నాడు. మరెక్కడో కాదు.. ఏకంగా మలద్వారంలో. ఔనండి నిజంగా.. 8 ఇంచుల పొడవైన ఆ బాంబును ఏమనుకున్నాడో ఏమో.. వెనుక నుంచి లోపలికి తోసేసుకున్నాడు. అప్పటివరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నొప్పితో విలవిల్లాడుతూ డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. అది పేలితే.. పైకి పోతామని తెలిసి.. హాస్పిటల్ యాజమాన్యం వెంటనే బాంబు స్క్వాడ్‌కు కబురు చేశారు. 

అక్కడ ఎలా పెట్టుకున్నావ్ బాసు?

ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. 24 ఏళ్ల వ్యక్తి కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉందని, మూత్ర ద్వారం వద్ద నొప్పిగా ఉందంటూ డాక్టర్లను సంప్రదించాడు. అయితే, బాగా సిగ్గేసిందో ఏమో.. అసలు విషయం చెప్పకుండా డాక్టర్ ముందు వంగున్నాడు. పరీక్షలు చేస్తున్న సమయంలో.. డాక్టర్ చేతికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో డాక్టర్‌కు ఒళ్లు మండింది. లోపల ఏం పెట్టుకున్నావో చెప్పు అని అతడిని నిలదీశాడు. అప్పుడు.. తాను ఓ 8 ఇంచుల వస్తువును వెనకాల పెట్టుకున్నానని, అనుకోకుండా అది లోపలికి దూరిపోయిందని చెప్పాడు. దీంతో డాక్టర్లు అతడికి సర్జరీ చేశారు.

హాస్పిటల్‌లో అలజడి.. క్షణంలో ఖాళీ

ఎట్టకేలకు డాక్టర్లు దాన్ని బయటకు తీశారు. మొదట్లో అదేంటో అర్థం కాలేదు. దాని మీద డేటు, బాంబ్ సెల్ అని రాసి ఉండటంతో హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి.. హాస్పిటల్‌లోని రోగులను బయటకు పంపేశారు. ఎమర్జెన్సీ వార్డులోని రోగులను అంబులెన్సు్ల్లో వేరే హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు కూడా ఆ బాంబును అక్కడే వదిలేసి.. బయటకు పరుగులు తీశారు. ఎట్టకేలకు బాంబ్ స్క్వాడ్ వచ్చి.. దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పేలితే ఏమయ్యేది?

అది మొదటి ప్రపంచం యుద్ధంలో వాడిన అర్టిల్లెరి షెల్. అది పేలి ఉంటే.. శరీరం ముక్కలైపోయేది. లక్కీగా అతడు డాక్టర్ల వద్దకు వచ్చాడు. ఇంట్లోనే బలవంతంగా దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించి ఉంటే పేలిపోయేది. అయితే, అసలు అతడికి ఆ బాంబు ఎక్కడ దొరికింది? అది ఎందుకు మలద్వారంలో ఉందనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. అతడి లైంగిక సుఖం కోసం దాన్ని వెనుక పెట్టుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదే ఆ బాంబు హిస్టరీ

ఆ బాంబు 1918 నాటికి చెందినదని తెలిసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ షెల్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇవి ఎక్కడ దొరికినా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఇంకా ఉనికిలో ఉన్న బాంబులను దాచి పెట్టుకుంటే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బాధితుడికి కూడా శిక్షపడే అవకాశం ఉంది. బాంబు ఎక్కడ దొరికింది? ఎందుకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు. అసలు అక్కడ ఎందుకు పెట్టుకున్నావ్.. ఇలా ఎన్నో ప్రశ్నలను అతడు ఎదుర్కోవల్సి ఉంటుంది.

ఇదే మొదటిసారి కాదు..

అయితే, ఇలా బాంబులను వెనక పెట్టుకున్న ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2022 సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన 88 ఏళ్ల పెద్దాయన కూడా ఇలాగే ఓ బాంబును వెనుక వైపు దూర్చుకున్నాడు. అప్పుడు కూడా డాక్టర్ల సాయంతో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది బాంబును డిస్పోజ్ చేశారు. లైంగిక చర్యలో భాగంగానే అతడు దాన్ని అక్కడ పెట్టుకున్నానని పెద్దాయన నిజాన్ని ఒప్పేసుకున్నాడు. అయినా.. కాటికి కాలు చాపిన ఆ వయస్సులో ఆ పాడు పనులేంటి పెద్దాయన?

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow