బీఆర్ఎస్‌లో హరీష్ రావుకు సపరేట్ గ్రూప్: Kalvakuntla Kavitha

కేసీఆర్ తప్పులు చేశారనే తప్ప..

మరోవైపు.. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశారనే తప్ప.. కృష్ణానది నీటి వాటాలపై అసలు చర్చనే చేయడం లేదని అన్నారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచీ ఉంటే ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఆనాడు రాష్ట్రంలో, కేంద్రంలో రెండూ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా అని అన్నారు. గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నిందలు వేస్తూ.. తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశారనే తప్ప.. కృష్ణానది నీటి వాటాలపై అసలు చర్చనే చేయడం లేదని కవిత అన్నారు.

 



 బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Kalvakuntla Kavitha)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆమె.. అక్కడ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌లో ఉంటూనే హరీష్ రావు సపరేట్ గ్రూపును తయారు చేసుకుంటున్నారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఈ పరిస్థితికి వచ్చాయని అన్నారు. హరీష్ రావు పట్ల బీఆర్ఎస్ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అన్నందుకు అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా? ఆ అంశంపై వాకౌట్ చేస్తే తరువాత సభకు రావచ్చు కదా.. మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా..? సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని కవిత సీరియస్ అయ్యారు. బాయ్‌కాట్ నిర్ణయం అధిష్టానానిదే అయితే.. అది మంచిది కాదు. బయట సభలు పెడుతూ.. చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణా పంపకాల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టారో చెప్పి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ చేయాల్సింది. హరీష్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి మార్పు చేశారు. హరీష్ నిర్ణయాలతో సాగు నీటి ప్రాజెక్టులకు తీవ్రం నష్టం జరిగింది’’ అని కవిత విమర్శించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow