ప్లాటు విషయంలో అత్తింటి కుటుంబ సభ్యులతో గొడవ పడిన ఓ మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

 


వీపనగండ్ల : అత్తింటి ఇంటి వద్ద ఉన్న ప్లాటు విషయంలో అత్తింటి కుటుంబ సభ్యులతో గొడవ పడిన ఓ మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం మండల పరిధిలోని బొల్లారం గ్రామానికి చెందిన గోవుల కృష్ణమ్మ, వెంకటయ్య దంపతులు తమ కూతురు శిల్పా (28)ను పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన శివ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అనంతరం భర్త మృతి చెందడంతో శిల్ప బొల్లారంలోని తన తల్లి ఇంట్లో నివసిస్తూ ఉండేది. పెంట్లవెల్లిలోని అత్త ఇంటి వద్ద తన భర్త పేరున ఉన్న ప్లాటును విక్రయించాలనే విషయంలో అత్తతో గొడవ పడిన శిల్ప మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బొల్లారంలోని తల్లి ఇంట్లో వాస్మాయిల్‌ (పురుగుల మందు) సేవించి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శిల్పను కుటుంబ సభ్యులు వెంటనే నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం పరిస్థితి విషమించగా, మధ్యాహ్నం మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. మృతురాలి తల్లి గోవుల కృష్ణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow