అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతుల మృతి

 

యలమంచిలి: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్‌ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 

ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

కృష్ణ కిశోర్‌ దశాబ్ద కాలానికి పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గంమధ్యలో దుబాయ్‌లో న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow