Gender Imbalance: అక్కడ పెళ్లికాని మగాళ్లకు ఫుల్ డిమాండ్.. గంటలు లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్న స్త్రీలు!


 Gender Imbalance: పురాతన కాలంలో ఆడపిల్లల్ని అంగట్లో సరుకుల్లా అమ్మేవారని మన తాతలు, తండ్రులు చెబుతుంటే వినే ఉంటాం. కానీ ఉత్తర యూరప్‌లోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న లాట్వియా దేశంలో ఇది రివర్స్ అయిపోయింది. అక్కడ పెళ్లికాని మగాళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే.. అక్కడ ఆడవాళ్ల జనభా ఎక్కువగానూ పురుషుల జనాభా తక్కువగా ఉండటమే కారణం. దీంతో ఈడు వచ్చినా తోడు దొరక్క స్త్రీలు అల్లాడిపోతున్నారట. ఇక చేయాల్సింది ఏమీ లేక.. గంటలు, రోజుల లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు మహిళలు. ఇదేదో వింతగా అనిపిస్తుంది కదూ! అసలు ఆ దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పురుషుల జనాభా తగ్గడానికి కారణం ఏమిటి.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం రండి..

లాట్వియా దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్ల జనాభా చాలా ఎక్కువట. దీంతో అక్కడి మహిళలు పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలే కరువయ్యారు. ఇక చేసేదేం లేక స్త్రీలకు తోడుగా, ఇంటి పనులు, ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు ఇచ్చే బోలెడు సంస్థలు కూడా పుట్టుకొచ్చాయని ఓ న్యూయార్క్ పోస్ట్‌ వెల్లడించింది.

తీవ్రమైన పురుషుల కొరత:

అక్కడ పురుషుల కంటే.. స్త్రీల జనాభా 25.5 శాతం ఎక్కువగా ఉందట. ఇది యూరోపియన్ యూనియన్‌లో సగటు కంటే 3రెట్లు ఎక్కువ. ఇక 65 కంటే ఎక్కువ వయసున్న వారిలో పురుషుల కంటే స్త్రీలు 2రెట్లు ఎక్కువ. న్యూయార్క్ పోస్ట్‌లో తెలిపిన కథనం ద్వారా చూసుకుంటే.. పని ప్రదేశాల్లో, రోజువారీ జీవితంలో పురుషుల కొరత స్పష్టంగా కన్పిస్తుందట. మగాళ్ల కొరత తీవ్రంగా ఉండటంతో భాగస్వామి కోసం ఆడవాళ్లు విదేశాలకు కూడా వెళ్లిపోతున్నారని కథనం తెలిపింది.

గంటల లెక్కన అద్దెకు భర్తలు:

పురుషుల కోసం విదేశాలకు వెళ్లలేని వారి కోసం గంటలు, రోజుల లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుని వారి సేవలు పొందుతున్నారట. ఇకపోతే మొగుళ్లను అద్దెకు ఇచ్చేందకు అనేక సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి.అంతేకాదు.. ఇంటిపనులు, ఇతర పనుల్లో నిష్ణాతులైన భర్తలకు మంచి గిరాకీ ఉందట. దీంతో లాట్వియాలోని పురుషులు గంటకు 44 డాలర్ల చొప్పున రోజుకు 280 డాలర్లు సంపాదిస్తున్నారట.

పురుషుల కొరతకు కారణం?

ఆ దేశంలో పురుషులు జీవన విధానం, దురలవాట్ల కారణంగానే వారి జీవన కాలం తగ్గిపోయి లింగ అసమతుల్యత ఏర్పడిందని వరల్డ్ అట్లాస్ తెలిపింది. అలాగే దేశంలోని పురుషుల్లో 31 శాతం మంది ధూమపానం చేస్తారని, అదే విధంగా ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నారని వెల్లడించింది. అందుకే లాట్వియా గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది.

ఫలితంగా రెంట్‌కు మొగుళ్ల ట్రెండ్‌:

లాట్వియాలో ఇంతలా పురుషుల సంఖ్య తగ్గిపోవడంతో.. భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్‌ పైపుకే మొగ్గు చూపుతున్నారు అక్కడి స్త్రీలు. అయితే, అద్దెకు భర్తలను తీసుకునే ట్రెండ్ ఒక్క లాట్వియాలోనే కాదు.. గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో ‘రెంట్ మై హ్యాండీ హస్బెండ్’ అనే వ్యాపారం కింద తన భర్తను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టాపిక్ అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow