రంగారెడ్డి గూడ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన రేవతి ఆనంద్ ను సన్మానించిన ఎంపీ డీకే అరుణ
నూతనంగా ఎన్నికైన రంగారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ రేవతి ఆనంద్ బాధ్యతతో గ్రామాభివృద్ధికి కృషిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ ముఖ్య కూడలి వద్ద నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రేవతి ఆనంద్ ను ఆమె శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ...
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించడం పట్ల వారికి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు, రంగారెడ్డిగూడ గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
