గచ్చు బావి పూర్వ వైభవం కోసం.. తరలివస్తున్న జనం

 

యూట్యూబర్ పిలుపుకు 

అనూహ్య స్పందన


గచ్చు బావి పునరుద్ధరణలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్న ప్రజలు 

యువత భాగస్వామ్యం అపూర్వం 


జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో గల గచ్చుబావి పునరుద్ధరణ పనులలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. జైపాల్ అనే యూట్యూబర్ ఇచ్చిన పిలుపుమేరకు చారిత్రక కట్టడాన్ని పునరుద్ధరించుకునేందుకు పట్టణ ప్రజలు నడుంబిగించారు. అందులో భాగంగా ప్రతి శనివారం బావిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తూ దానిని పరిశుభ్రం చేసే పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నిర్వహణ విషయంలో యువత భాగస్వామ్యం అపూర్వంగా కొనసాగుతున్నది. వారితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల చెందిన అన్ని వయస్సుల వారు పనులు నిర్వహిస్తుండడం విశేషం. ఈ చారిత్రక కట్టడం ఆనవాళ్లు కనుమరుగు కాకుండా చూసేందుకు కాపాడుకోవడానికి యూట్యూబర్ జైపాల్ చూపిన చొరవ గచ్చుబావి పూర్వ వైభవాన్ని సంతరించు కునేందుకు దోహదపడడం ఈ తరం ప్రజలకు గర్వకారణం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow