బిజినపల్లి : పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బిజినపల్లి గ్రామంలోని శంకర్ ఇంట్లో నిశ్చబ్దంగా 7గురు పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా.. వారి వద్ద నుంచి రూ.20వేల నగదు, రెండు బైకులు, ఒక ఆటో, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టు బిజినపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Tags
mahabubnagar