కోనేరులో పడి యువకుడి గల్లంతు గాలిస్తున్న N D R F సిబ్బంది

 *వెంకటేశ్వర స్వామి ఆలయ కోనేరులో పడి వ్యక్తిగల్లంతు*

*-మృతదేహం కోసం గాలింపు చేపడుతున్న ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది*

*-జడ్చర్ల పట్టణంలో ఘటన.



జడ్చర్ల మున్సిపాలిటీ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో పడి పట్టణానికి చెందిన ప్రవీణ్ 26 అనే వ్యక్తి గల్లంతయ్యాడు. మున్సిపాలిటీలోని నాలుగో వార్డుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి వంట పనులు చేస్తూ సోమవారం జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలోని కోనేరు వద్దకు వెళ్లి చాలాసేపు కూర్చున్నారని ఆ తర్వాత కోనేరు వద్ద బట్టలు చెప్పులు ఉండగా ప్రవీణ్ కనపడకపోవడంతో కోనేరులో పడి గల్లంతయినట్లు స్థానికులు స్థానిక పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో పోలీసులు ఫైర్ సిబ్బంది నటన స్థలానికి చేరుకొని తమ సిబ్బందితో ప్రవీణ్ ఆచూకీ కొరకు కోనేరులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ప్రవీణ్ కోనేరులో గల్లంత గల కారణాలు తెలియ రాలేదని గల్లంతైన ప్రవీణ్ డెడ్ బాడీ ఆచూకీ లభించాక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow