అజారుద్దీన్ బనగాయ మినిస్టర్..! జూబ్లీ ఎలక్షన్స్ మహిమ.. రాజగోపాల్ ఏమంటాడో..?

 Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రిగా ఎమ్మెల్సీ అజారుద్దీన్‌‌కు చాన్స్..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వేళ కేబినెట్ విస్తరణకు పూనుకుంది. ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు సమాచారం. శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు లభించింది. మంత్రిగా.. ఎమ్మెల్సీ అజారుద్దీన్‌ను తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. శుక్రవారం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పరోక్షంగా MIM మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించి.. తమ ప్రాధాన్యతను తెలియజెప్పింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow