Kaleshwaram Project ON ACB: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయనున్నారు ఏసీబీ(ACB) అధికారులు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు కోరుతూ లేఖ రాసింది తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్‌మెంట్. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ పంపిన లేఖను తెలంగాణ సీఎస్‌కు పంపించారు ఏసీబీ డీజీ. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.  గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ, ఈఈ అధికారుల వద్ద భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow