• జడ్చర్ల విద్యా రంగంలో మరో మైలురాయి
• బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో ప్రతిష్టాత్మక జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు
• పెడ్డాయిపల్లి లో ఇదివరకే మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్
• నవోదయ మంజూరు కు ఎంపీ డీకే అరుణ సహకారం
• ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషికి ఫలితంగా మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ
• ఎంపీకి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృతజ్ఞతలు
ఆగష్టు 8:
జడ్చర్ల నియోజకవర్గానికి విద్యారంగంలో మరో గర్వకారణమైన అవకాశం లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో స్థాపించబోయే జవహర్ నవోదయ విద్యాలయం, జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్దయిపల్లిలో ఏర్పాటు కానుంది. నవోదయ ను జడ్చర్ల నియోజకవర్గం లోని పెద్దాయిపల్లి లో ఏర్పాటు చేయడానికి సహకరించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ఎంపీ డీకే అరుణ సానుకూలంగా స్పందించి మంజూరు లో కీలక పాత్ర పోషించారు.
ఇప్పటికే పెద్దయిపల్లిలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం, మహబూబ్‌నగర్ – జడ్చర్ల మధ్య ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడం విద్యా రంగంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నదానికి నిదర్శ,నం. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి చేసిన ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నవోదయ విద్యాలయం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఉచితంగా అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని అనిరుధ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.