అనిశ వలలో(ACB) ఇరిగేషన్ సబ్ డివిజన్ అధికారి


మహబూబ్ నగర్ బ్యూరో : లంచం తీసుకుంటూ

ఇరిగేషన్ సబ్ డివిజన్ -1 అధికారి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. 150 గజాల ఒక స్థలానికి సంబంధించి వివిధ శాఖల ఎన్ఎసీ పొందేందుకు వీలుగా అవసరమైన అనుమతి పత్రాల కోసం ఆ స్థలం యజమాని ఇరిగేషన్ అధికారులను సంప్రదించాడు. అందుకుగాను ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్ పని చేయకుండా కొర్రీలు వేశాడు. దీంతో యజమాని సంప్రదింపులు జరుపగా ఏఈ రూ.ఐదు వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. మూడు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.

ఆశ్రయించాడు. ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ అధికారి సీహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యజమాని కి తగిన సలహాలు సూచనలు చేసి ఒప్పందం గుర్తుంచుకున్నట్లు రూ.3000 ఇచ్చి పంపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరీ లో ఇంటి స్థల యజమాని నుండి ఏఈ మూడు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారం రోజులు తిరగకుండగానే భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు ఆమోదం కోసం 5000 డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన ఘటన మరువకముందే.. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ఏసీబీకి చిక్కడం మహబూబ్ చర్చనీయాంశంగా మారింది.

Previous Post Next Post

نموذج الاتصال