ఓవల్ టెస్ట్ లో 6 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

 

లండన్: ఇంగ్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ ఇండియా సంచలన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), జోష్ టంగ్ (0)లను భారత బౌలర్లు త్వరగానే వెనక్కి పంపారు. అట్కిన్సన్ (17) చివరి వికెట్గా వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో టీన్ఇండియా 396 పరుగులు చేసింది.

ఓల్డ్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ పై ఆరు రన్స్ తో ఘనవిజయం సాధించింది. 

మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసుకోవడం విశేషం 


వికెట్లు తీసుకున్న ప్రసిద్ధి కృష్ణ4వికెట్లు  ఒంటి చేతి తో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ వర్క్స్ 

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు చాలా ఉత్కంఠను రేపింది. ఇంగ్లాండ్‌కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కు 4 వికెట్లు కావాలి. ఇలాంటి సమయంలో అందరి దృష్టి క్రిస్ వోక్స్‌పై పడింది. చేతికి గాయమైనప్పటికీ, జట్టు గెలుపు కోసం అతను ఒక చేత్తో బ్యాటింగ్ చేయడానికి రావడమే ఈ మ్యాచ్‌లోని అతిపెద్ద సంచలనం. ఐదో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు క్రిస్ వోక్స్‌కు ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత అతను బౌలింగ్ చేయలేదు, ఫీల్డింగ్ కూడా చేయలేదు. దీంతో అతను టెస్ట్ నుంచి పూర్తిగా బయటపడ్డాడని అందరూ భావించారు. అయితే, జో రూట్ చెప్పినట్లుగానే వోక్స్ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు.

భారతదేశ ఇగ్లాండ్లో సీరియస్ డ్రా చేసుకోవడం గ్రేట్ గా చెప్పుకోవచ్చు

 

Previous Post Next Post

نموذج الاتصال