Ganja: గంజాయి వచ్చిందంటూ గ్రూప్‌లో పోలీస్‌ల మెసేజ్.. ఆ తర్వాత!

'భాయ్ బచ్చా ఆ గయా భాయ్' పేరుతో వాట్సాప్ కోడ్ భాషతో సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఇదే కోడ్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ చేశారు. అంతే, ఆడామగా తేడాలేకుండా, ఫ్యామిలీలు సైతం..

హైదరాబాద్, జులై 13: హైదరాబాద్‌లో గంజాయి నెట్‌వర్క్‌ను చేధించేందుకు ఈగల్ టీమ్ ఇవాళ స్పెషల్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. అయితే, ఈ ఆపరేషన్లో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహరాష్ట్రకి చెందిన సందీప్ అనే గంజాయి సరఫరా దారుడిని అరెస్ట్ చేశారు ఈగల్ సెల్ అధికారులు. అతని కాంటాక్ట్ లిస్ట్ ద్వారా ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది

హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సమీపంలో ఈ ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ టీమ్‌. ఇందులో మొదటగా గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు వాట్సాప్ సందేశం పెట్టారు పోలీసులు. అంతే, మెసేజ్ పెట్టిన రెండు గంటల్లో లొకేషన్‌కు 14 మంది వినియోగదారులు పరుగుపరుగున వచ్చేశారు. 'భాయ్ బచ్చా ఆ గయా భాయ్' పేరుతో వాట్సాప్ కోడ్ భాషతో సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఇదే కోడ్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా వీళ్ల బండారం బయటపడింది.


దీంతో వాట్సప్ గ్రూప్‌లో ఉన్న 100 మంది వివరాలను పోలీసులు సేకరించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 14 మంది ఉండగా, మిగతా 86 మందిని ట్రేస్ చేస్తున్నారు. 14 మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో పరీక్షలు నిర్వహించగా గంజాయి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ 14 మందిలో రెండు జంటలు ఉండగా, ఒక భార్య, భర్త తమ 4 ఏళ్ల పిల్లాడితో గంజాయి కొనేందుకు వచ్చారు. వీరిలో భర్తకి పాజిటివ్ అని తేలింది.


మరో భార్య, భర్త ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. మహారాష్ట్రకి చెందిన పెడ్లర్ సందీప్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గంజాయి నెట్వర్క్ చేధించే పనిలో పడ్డారు..

Previous Post Next Post

نموذج الاتصال