Fake Alcohol: కల్తీ.. కిక్కు..


 ఈత, తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లును సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలో చెట్లు తక్కు వగా ఉన్నా కల్లు ఎక్కువగా సరఫరా అవుతోంది

పేదల ఆరోగ్యంతో చెలగాటం

జిల్లాలో కల్లు వ్యాపారం తీరిది.. మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు...

ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగు తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఎంత క ల్లు ఉత్పత్తి అవుతుంది. ఎంత వ్యాపారం జరుగుతుం ది. ఎన్ని ఈత, తాటిచెట్లు ఉన్నాయి. అందులో ఎన్ని చెట్ల ద్వారా కల్లును ఉత్పత్తి చేస్తున్నారనే విషయాన్ని అధికారుల వద్ద సంక్షిప్తసమాచారం లేదనే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాటేస్తున్న కల్తీ కల్లు...

తాటి, ఈత చెట్ల నుంచి తీసే స్వచ్చమైన కల్లుకు బదులుగా నిషేధిత మత్తు పదార్థాలై అల్ర్పాజోలం, డైజో ఫాం వంటి నిషే ధిత పదార్థాలతో కల్లు తయారు చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మంచిర్యాల కల్లు కాంపౌండ్లలో అల్ర్పాజోలం 600 నుంచి 700గ్రాముల మందును కలిపి కల్లును తయారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నాలుగు రోజుల నుంచి మందు బాబుల్లో మార్పు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీకల్లు తాగి 11మంది మృతి చెందడంతో ఎక్సయిజ్‌ అధికారులు మూడు రోజు ల నుంచి ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో కల్లు కల్తీ చేయకపోవడం వల్ల తెల్లకల్లుబట్టీల్లో తాగు మం దుబాబులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్లుబాగా లేదంటూ కౌంటర్‌లో గొడవలకు సైతం దిగుతున్నారు. కల్తీకల్లు తాగిన అలవాటుకు మామూలు కల్లు తాగడం తోనే వారిలో మార్పు వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.

డబ్బు సంపాదనే ధ్యేయంగా...

కొందరు కల్లు వ్యాపారులు నిషేధిత డైజోఫాం, అ ల్ర్పాజోలం వంటి మత్తు పదార్థాలను కలుపుతూ ప్ర జలకిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరో పణలు ఉన్నాయి. మత్తు పదార్థాలు కలుపడం ప్రమాదకర మని తెలిసిన ధనార్జనే లక్ష్యంగా వ్యాపారులు కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఎక్కు వగా రైతు కూలీలు, పేదలు రోజంత పడిన కష్టాన్ని మరిచిపోయేందుకు కల్లు తాగుతారు. ఈ రసాయ నాలు కలిపిన కల్లు తాగడం వల్ల ఒక్క రోజు తాగక పోయిన వారు పిచ్చిపిట్టినట్లుగా వ్యవహరిస్తారు.


Previous Post Next Post

نموذج الاتصال